వినియోగదారుల ఉద్యమం మరియు చరిత్ర……బమ్మిడి నరేంద్ర కుమార్
*అంతర్జాతీయ వియోగదారుల దినోత్సవం…*
మొట్ట మొదటిసారిగా వినియోగదారుల ఉద్యమం అమెరికాలో ప్రారంభమయింది….
రాల్ఫ్ నాడార్ అనే వ్యక్తి అమెరికాలో కొన్ని సేవా సంస్థలు నడిపేవాడు..తన అవసరాల నిమిత్తం జనరల్ మోటార్స్ కంపెనీ వద్ద ఒక కారు కొనడం..అది కొద్ది రోజులలో చెడిపోవడం…నష్టపోయాననే ఉద్దేశంతో కార్ల యాజమాన్యాన్ని నిలదీయగా వారు తిరస్కరించడం వలన….తన నష్ట నివారణ కొరకు ఉద్యమం చేపట్టడం…ఈ ఉద్యమం ఉవ్వెత్తున పెరిగి అమెరికా చట్ట సభలలో చర్చకు రావడం జరిగింది.. దేశంలో వినియోగదారులు నష్టపోవడాన్ని అమెరికా చట్ట సభలో చర్చించి వియోగదారుల రక్షణకు జాన్ ఎఫ్ కెనడీ నేత్రృత్వంలో 1962 మార్చి 15 న చట్టం చేయడం జరిగింది… అప్పటి నుండి ప్రపంచ వియోగదారుల దినోత్సవం ప్రతీ ఏటా మార్చి 15 న జరుపుకుంటున్నాము…
1985 ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు అన్ని దేశాలలో వినియోగదారుల రక్షణ చట్టాలు అమలు చేయాలి అన్న సూచనల మేరకు భారతదేశంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేత్రృత్వంలో 1986 డిశంబర్ 24 న భారత చట్ట సభల్లోలో చట్టం చేయడం జరిగి రాష్టప్రతి ఆమోదం పొందింది.
అప్పటి నుండి ఇప్పటి వరకూ డిశంభర్24 జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నాము.
*1986 రక్షణ చట్టంలోని హాక్కులు*
అవి
1.వస్తువులు/ సేవలు ఎంపిక చేసుకునే హక్కు.
2.బద్రత పొందే హక్కు
3.విద్యను పొందే హక్కు
4.సమాచారం పొందే హక్కు
5.నష్టపరిహారం పొందే హక్కు
6.విజ్ఞప్తి చేసుకునే హక్కు
7.ఆరోగ్యకరమైన పరిసరాలు పొందే హక్కు
ఈ ఏడు హక్కులతో 1986 రక్షణ చట్టం చేయడం జరిగింది..
వినియోగదారుడు అంటే ఎవరు?
ఎవరయితే వస్తువులను లేదా సేవలను డబ్బు చెల్లించి గాని చెల్లిస్తానని చెప్పి వాగ్ధానం చేసి లేద వస్తు మార్పిడీ ద్వారా కొనుగోలు చేస్తారో,ఈ నేల, నీరు,గాలిని వినియోగించుకుంటారో వాల్లంతా వినియోగదారులే.
ఈ చట్టం ప్రకారం ఏ వినియోగదారుడైనా వస్తువులను ఏదయినా సేవలను కొనుగోలు చేసి అందులో చెల్లించిన డబ్బులకు తగిన వస్తువును లేదా సేవలను పొందకపోతే
నష్ట నివారణ కోసం తగిన ఆధారాలతో వినియోగదారుల ఫోరంలను ఆశ్రయించి తగిన నష్టాన్ని పొందవచ్చును.
ఈ చట్టం అమల్లోకి వచ్చేటప్పటికి వినియోగదారులు నేరుగా వ్యాపారస్తుని వద్ద కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది..
శాస్త్ర సాంకేతిక రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందడం,మొభైల్ విప్లవం అందుబాటులోకి రావడం ,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IOT
ఎక్కువగా పెరగడంతో డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చి వినియోగం పెరగడంతో వినియోగదారులు 24 గంటలూ మొభైల్,సిస్టమ్ లతో వస్తువులు కొనుగోలు చేసే తీరిక లేకుండా గడుపుతున్నాడు అన్న ఉద్దేశ్యంతో ఆలీబాబా,
అమేజాన్,ప్లిఫ్ కార్ట్,మీ షో వంటి వేలాది ఆన్‌లైన్, టెలి మరియు ఆన్లైన్ మార్కెటింగ్ తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇ-కామర్స్ విధానం అమలు లోకి వచ్చింది.
*ఇ-కామర్స్ అంటే*
ఇ-కామర్స్ (ఎలక్ట్రానిక్ కామర్స్) అనేది ఎలక్ట్రానిక్ నెట్‌వర్క్, ప్రధానంగా ఇంటర్నెట్ ద్వారా వస్తువులు మరియు సేవల కొనుగోలు మరియు అమ్మకం లేదా నిధులు లేదా డేటాను ప్రసారం చేయడం.
ఈ ఆన్లైన్ దిగ్గజ సంస్థలు 24 గంటలు రాత్రి పగలు తేడాలేకుండా ఆన్లైన్లో వస్తువులు మరియు సేవలు అమ్మడం జరుతున్నది.ఈ ఆన్లైన్ మార్కెటింగ్ లో ఎవరెవరు వస్తువులు అమ్ముతున్నారో ,ఎవరు వస్తువులు కొనుగోలు చేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది… ఇలాంటి సమయంలో వినియోగదారులు వస్థు మరియు సేవాలోపంలో పొందే నష్టానికి ఎవరిని సంప్రదించాలో తెలియని గందరగోళ పరిస్తితుల్లో
వినియోగదారుల నష్ట నివారణ మరియు నష్ట పరిహారం కోసం కోసం కేంద్ర ప్రభుత్వం పాత చట్టం స్థానంలో 2019 లో కొత్త రక్షణ చట్టం రూపొందించింది.
2020 జులై 20 నుంచి ఇది దేశమంతటా అమల్లోకి వచ్చింది.
అమేజాన్ వంటి ఇ కామర్స్ దిగ్గజ సంస్థలు అన్ని 2019 రక్షణ చట్టం పరిధిలోకి వస్తాయి.వినియోగదారులకు బాధ్యత వహించవలసి ఉంటుంది.
*ఏవిధంగా ఫిర్యాదు చేయవచ్చు*
న్యాయవాది అవసరం లేకుండా నేరుగా వినియోగదారుడే ఫిర్యాదు చేయొచ్చు
జిల్లా స్థాయిలో కంజ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుంది. వస్తు సేవల్లో లోపాలు జరిగితే ఈ కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
రూ.5 లక్షలు విలువైన వస్తుసేవల వరకు సంబంధించిన కేసులలో ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించనక్కర్లేదు.
చట్ట ప్రకారం కేసు నమోదైన 120 రోజుల్లోపు తీర్పులు వెలువరిస్తారు.
జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పుపై అసంతృప్తి ఉంటే రాష్ట్ర కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
వస్తువు ఎక్కడ కొన్నా సొంత జిల్లాలో కంప్లయింట్ చేయొచ్చు
దేశంలో ఎక్కడ వస్తువు కొన్నా, ఎక్కడ సేవా లోపం ఉన్నా ఆ వినియోగదారుడు నివసించే లేదా ఉద్యోగం చేసే జిల్లా కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
రూ. 50 లక్షలు విలువైన వస్తుసేవలకు సంబంధించిన కేసుల వరకు జిల్లా స్థాయిలో విచారిస్తారు.
రూ. 50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు విలువజేసే కేసులను రాష్ట్ర కమిషన్‌లో విచారిస్తారు.
రూ. 2 కోట్ల విలువ కన్నా పైన ఉంటే జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాలి.
బాధితులు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేసుకునేందుకు ఈ-దాఖిల్ ( https://edaakhil.nic.in/ ) అనే వెబ్‌సైట్/యాప్ అందుబాటులో ఉంది.
నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ ( ఎన్‌సీహెచ్) మొబైల్ యాప్‌లో కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చు.
ఫోన్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు
1915, 1800114000 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్‌కు తెలియజేస్తారు.
వస్తువు కొనేటపుడు బిల్లు, రశీదు, ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఇన్‌వాయిస్‌లను, ఐడీలను భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఫిర్యాదు సమయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుంది.
‘వినియోగదారుల కమిషన్ పరిధిలోకి ప్రభుత్వ శాఖలు కూడా వస్తాయి.
ఉదాహరణకు రైలు టికెట్లు రద్దు చేసుకుంటే సంబంధిత డబ్బులు అకౌంట్‌లో పడకపోయినా ఫిర్యాదు చేయవచ్చు” .
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక
కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం (INGRAM), జాతీయ మరియు రాష్ట్ర వినియోగదారుల హెల్ప్‌లైన్‌లు, అంబుడ్స్‌మన్ పథకం వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను కూడా ఏర్పాటు చేసింది.
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. వినియోగదారుల రక్షణ చట్టం, 1986లోని నిబంధనల ప్రకారం, వినియోగదారుల వివాదాలను సరళమైన, చవకైన మరియు వేగవంతమైన పరిష్కారానికి అందించడానికి జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో మూడు అంచెల పాక్షిక-న్యాయ యంత్రాంగం ఏర్పాటు చేయబడింది.
వివాద పరిష్కార ప్రత్యామ్నాయం
ADR(Alternative Dispute Resolution), పేరు సూచించినట్లుగా, న్యాయస్థానాల ద్వారా వివాద పరిష్కార సంప్రదాయ ప్రక్రియకు ప్రత్యామ్నాయం. ఇది న్యాయస్థానాల వెలుపల వివాదాలను పరిష్కరించడానికి అభ్యాసాలు మరియు సాంకేతికతలను కలిగి ఉంటుంది.
CGRF(Consumer Grievance Redressal Forum) లైసెన్సుదారు యొక్క ఏదైనా రికార్డు లేదా ఫిర్యాదుదారు నుండి ఫిర్యాదును పరిశీలించడం మరియు పరిష్కరించడం కోసం సంబంధిత సమాచారాన్ని కోరవచ్చు మరియు ఫోరమ్ కోరే సమాచారం, పత్రం లేదా రికార్డును అందించడానికి పార్టీలు బాధ్యత వహించాలి.
భారతదేశంలో చట్టబద్ధంగా గుర్తించబడిన మొదటి ADR మెకానిజమ్‌లలో ఒకటి మధ్యవర్తిత్వం. భారతదేశంలో మధ్యవర్తిత్వ చట్టం యొక్క మూలం 1859 చట్టం VIIIకి రుణపడి ఉంది, ఇది సివిల్ కోర్టుల విధానాన్ని క్రోడీకరించింది. 1899 సంవత్సరంలో, బ్రిటిష్ ప్రభుత్వం మధ్యవర్తిత్వ చట్టాన్ని ఆమోదించింది, ఇది 1899 ఆంగ్ల చట్టం యొక్క నమూనా ఆధారంగా రూపొందించబడింది.
ADR ప్రక్రియలు ప్రత్యక్ష చర్చలు, మధ్యవర్తిత్వం, మధ్యవర్తిత్వం, అంబుడ్స్‌మన్ పథకాలు, రాజీ లేదా తీర్పును కలిగి ఉంటాయి. వినియోగదారు వివాదాల కోసం, ADR అంటే సాధారణంగా నిష్పాక్షిక వివాద పరిష్కార సంస్థ సహాయంతో ఫిర్యాదును పరిష్కరించడం.
పరిహారం కోరుకునే హక్కు: అక్రమ వ్యాపార వ్యవస్థలు లేదా వినియోగదారులపై అన్యాయమైన దోపిడీకి వ్యతిరేకంగా పరిహారం కోరే హక్కు. ఇది వినియోగదారు యొక్క చట్టబద్ధమైన ఫిర్యాదుల యొక్క సహేతుకమైన పరిష్కారానికి హక్కును కూడా కలిగి ఉంటుంది. వారు తమ హక్కుల గురించి బాగా తెలుసుకోవాలి మరియు వాటిని అమలు చేయాలి.
మోసం ఎదులర్కోవడం ఎలా
*నమ్మకం ఉన్న వెబ్ ద్వారా కొనడం
*క్యాష్ ఆన్ డెలివరీ
*ఓపెన్ చేసేటప్పుడు వీడియో విధిగా తీయాలి.
*రిటర్న్ అవకాశం ఉన్న వస్తువులను కొనండి.
*Ex:-దుస్తులు చెప్పులు వేరు వేరు కంపెనీలు XL లకు వేరు వేరు కొలతలు ఉంటాయి.వచ్చాక సరిపోవు .ముందే రిటర్న్ ఉంటే కొనాలి.
@ మందులు మనం ఆన్లైన్లో తెప్పించుకున్నప్పుడు
ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉంది అని మనకు సజెస్ట్ చేస్తూ ఫోన్ కాల్స్ వస్తాయి..డాక్టర్ ను సంప్రదించి తీసుకోవాలి.
@మనకు కొన్ని వస్తువులు ఆన్లైన్లో కొనేటప్పుడు
Scratch cord పంపుతారు అందులో QR code
స్కాన్ చేస్తే మంచి గిప్టు గెలిచారు అని వస్తుంది ఈ నెంబరు కు పోన్ చేయండి లింక్ పంపుతారు అంటారు… వచ్చె లింక్ మన గూగుల్ ఫోన్ పేలకు కనెక్ట్ అయి డబ్బులు పోతున్నాయి…ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త ఉండాలి.
సాధారణంగా ఆన్లైన్ లో ధరను పెంచి 50 -60 % అని ఆఫర్స్ ఇస్తుంటారు…MRP ను ముందుగా చెక్ చేసుకోవలెను…..
ఆన్లైన్ పేకేజ్ వచ్చేటప్పుడు కంపెనీలు వాల్ల సీల్ తో ప్యాకేజీ చేసిఉంటారు..పరిశీలించాలి దానిలో ఏమయినా మార్పలు ఉంటే తీసుకోవద్దు…
NCH,UMANG వంటి.apps కంప్లైంట్
నేషనల్ కంజ్యూమర్ హెల్ప్ లైన్ సైట్ లేదా ఆప్ లల్లో రిజిస్టర్ గ్రీవియన్స్ లో వివరాలు నమోదం చేయండి…40 రోజుల లో పరిష్కరించబడుతుంది.