Noble Teachers’ Association, Vizayanagaram District Excutive Meeting at APNGO home,Dt: 14-12-2025.



TET పై ఉపాధ్యాయులు ఆందోళన చెందవలసిన అవసరము లేదు వేపాడ చిరంజీవి గారు ఉత్తరాంధ్ర శాసనమండలి సభ్యులు. టెట్ పరీక్ష విషయంలో ఇప్పటికే గౌరవ విద్యాశాఖ మాత్యులు లోకేష్ బాబు గారితో మాట్లాడి సుప్రీంకోర్టులో పిల్ వేయడం మరియు గౌరవ ఎంపీల ద్వారా లోకసభలో మాట్లాడించడం కేంద్ర మంత్రివర్గ సభ్యులతో మాట్లాడటం తదితర కార్యక్రమాలు చేయడం జరిగిందని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యులు శ్రీ వేపాడ చిరంజీవి గారు తెలియజేసిరి .ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము ఐదు మంది గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యులు ఎప్పుడు మీ వెన్నంటి ఉంటామని మీ సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయులు నిరంతరం మనతో ఉన్న పేద విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేయాలని, మీకు రావలసిన ఆర్థిక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖ చ్చితంగా సాధిస్తామని తెలియజేసిరి. రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ నోబుల్ టీచర్ అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పండితుల ప్రమోషన్లు సాధించడంలోనూ, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు అవసరమైన క్వాలిఫికేషన్ సాధించడానికి త్వరలో ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లు తెలియజేసిరి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు వెంటనే బాషా ఉపాధ్యాయులుగా తగిన అర్హతలు ఉన్న వారికి వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని తీర్మానం చేయడమైనది. KGBV పాఠశాలల్లో స్టడీ అవర్స్ కి ట్యూటర్స్ ను మరియు హాస్టల్ నిర్వహణకు వార్డెన్ లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమైనది. APMS ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో కింద జీతాలు మాత్రమే వస్తున్నాయని దానితోపాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను వర్తించే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులను సవరించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైమారావు మాట్లాడుతూ సంఘ నిర్మాణం మరియు సంఘాన్ని బలోపేతం చేయడం మండల శాఖలు మరియు జిల్లా శాఖలతోనే ఉంటుందని వారు నిస్వార్ధంగా పనిచేసే జిల్లాలోని ఉపాధ్యాయులకు సేవలు అందించినప్పుడే సంఘం బలోపేతం అవుతుంది అన్నారు ఉపాధ్యాయ సమస్యల సాధనలో నిరంతరం అందుబాటులో ఉంటామని సంఘ నిర్మాణం కోసం నిరంతరం పోరాడుతామని తెలియజేసిరి ఈ సందర్భంగా విజయనగరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా శ్రీ జోగారావు గారిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీ గోవింద నాయుడు గారిని, జిల్లా గౌరవాధ్యక్షులుగా చిరంజీవి నాయుడు గారిని, ఆర్థిక కార్యదర్శిగా మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది