CHILD CARE LEAVE G O Ms No. 132 Dated 06/07/2025
చైల్డ్ కేర్ లీవ్ గురించి పూర్తి సమాచారం..
ఉద్యోగులు తమ పిల్లల బాగోగులు చూసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చైల్డ్కేర్ లీవ్ మంజూరు చేస్తూ/ గతంలో జారీ చేసిన ఉత్తర్వులలో పిల్లల వయసుపై ఉన్న గరిష్ఠ వయోపరిమితిని ఎత్తివేస్తూ -జి.ఓ.నెం. 70 ఆర్థిక శాఖ తేది: 15-12-2025ను జారీ చేసింది. పిల్లల గరిష్ఠ వయోపరిమితిని ఎత్తివేసినందువలన కలిగే ప్రయోజనాలను పరిశీలిద్దాం.
ఆరవ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు 2008 నవంబర్లో కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 2 సంవత్సరాలు చైల్డేకేర్ లీవు కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది. దరిమిలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన మీదట కొన్ని షరతులు విధిస్తూ సర్వీసు మొత్తం మీద 60 రోజులు చైల్డిరైవ్ను మహిళా ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు.
ఈ 60 రోజులు సెలవు వాడుకోవటానికి కొన్ని షరతులను విధించింది. ఈ మొత్తం సెలవును 18 సం||ల కంటె తక్కువ వయసు కలిగిన పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు మరియు 22 సంవత్సరాల కంటె తక్కువ వయసు కలిగిన శారీరక వైకల్యం కలిగిన పిల్లలున్న వారికి, ఇద్దరు పిల్లల వరకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ సెలవును మూడు విడతల కంటె తక్కువ విడతలలో వాడుకోరాదు. పిల్లలు ప్రభుత్వ ఉద్యోగిపైన ఆధారితులయి ఉంటేనే ఈ సెలవు అనుమతిస్తారు.
సెలవు మంజూరు అధికారి కార్యాలయ పరిస్థితులను పరిశీలించి పనులకు ఆటంకం కలుగదనుకున్నప్పుడే మంజూరు చేయాలి. ఈ సెలవు ఉద్యోగుల హక్కు కాదు. మంజూరు అధికారి ముందస్తు ఆమోదంతోనే సెలవు పెట్టుకోవాలి.
ఈ సెలవు సాధారణ సెలవు, ప్రత్యేక సాధారణ సెలవులు మినహాయించి ఇతర సెలవులైన మెటర్నిటీ లీవు, సంపాదిత సెలవు మెదలైన సెలవులతో కలిపి వాడుకోవచ్చు.
ప్రొబేషన్ కాలంలో కూడా ఈ సెలవులను వినియోగించు కోవచ్చును. అయితే ఎంతకాలం సెలవు వినియోగించుకొంటే అంతకాలం ప్రొబేషన్ పీరియడ్ పొడిగించబడుతుంది.
ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.నెం. 33 ఆర్ధిక శాఖ తేది: 08-03-2022ను జారీ చేసింది. ఈఉత్తర్వులలో మహిళా చైల్డ్్కర్ లీవ్ 60 రోజుల నుండి 180 రోజులకు పెంచారు.
ఒంటరి(అవివాహితులు/విడాకులు పొందినవారు/ భార్య మరణించినవారు) పురుషులకు కూడా 180 రోజులు చైల్త్కేర్వ్ వాడుకునే అవకాశాన్ని ఈ ఉత్తర్వుల ద్వారా కల్పించారు. అయితే జి.ఓ.నెం. 132 తేది: 08-03-2016లోని షరతులన్నీ వర్తిస్తాయని పేర్కొన్నారు.
180రోజుల చైల్డ్ కేర్ లీవు వాడుకొనే సౌలభ్యాన్ని 3 విడతల కంటె తక్కువ విడతలలో వినియోగించరాదనే నిబంధనను సడలించి మొత్తం సర్వీసులో 10విడతలలో వినియోగించుకోవాలని ఉత్తర్వులు జారీచేశారు. (జి.ఓ. నెం. 199 ఆర్థికశాఖ తేది: 19-10-2022) అయితే గతంలో 60రోజులు కాని అందుకు కొంతభాగం కాని కొన్ని విడతలు (స్పెల్స్)గా వినియోగించుకొన్నవారు తాము వినియోగించుకున్న రోజులను 180రోజుల నుండి మినహాయించి మిగిలిన రోజులు వినియోగించు కోవచ్చు. వారు ఇంతకుముందు ఎన్ని విడతలు (స్పెల్స్)గా వినియోగించు కున్నప్పటికీ వాటిని పరిగణించకుండా జి.ఓ.నెం.33. విడుదల అయిన తేది 08-03-2022 నుండి సర్వీసు నుండి రిటైర్ అయ్యేలోవుగా 10 విడతల (స్పెల్స్) లో ఈ సెలవు పేర్కొన్నారు.
ఉద్యోగ సంఘాల అభ్యర్ధన మేరకు మహిళా ఉద్యోగులు చైల్కేర్ లీవ్ వినియోగించుకొనుటకు వయోపరిమితి లేదంటూ, మైనర్లయిన పిల్లల పరిరక్షణ కొరకు రిటైర్మెంట్ వరకు కూడా ఈ సెలవులు వినియోగించుకోవచ్చునంటూ, జి.ఓ.నెం. 36 ఆర్ధికశాఖ తేది: 16-03-2024 జారీచేశారు. అయితే ఈ జి.ఓ. వలన ఎటువంటి ఉపయోగం లేదని ఉద్యోగుల వయోపరిమితిని ఎత్తివేయడం కాదని, పిల్లల గరిష్ట వయోపరిమితిని సవరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.
పిల్లల వయసు పైన ఉన్న గరిష్ఠ పరిమితిని తొలగిస్తూ పిల్లల వయసుతో సంబంధం లేకుండా, మహిళా ఉద్యోగులు, ఒంటరి పురుష ఉద్యోక వరానివదవీవిరమణ చేసేవరకు, బి పిల్లల బాగోగులు చూసుకోవడానికి వినియోగించుకోవచ్చునంటూ జి.ఓ.నెం. 70 อ๋อ: 15-12-2025 5 . 64.4.5 పైన పేర్కొన్న, ఇంతకుముందు జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులలోని నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
జి.ఓ.నెం. 132 తర్వాత విడుదల చేసిన ఈ ఉత్తర్వులన్నింటినీ పరిశీలిస్తే 60 రోజుల నుండి 180 రోజులకు పెంపుదల, ఒంటరి పురుషులకు వర్తింపు, 3 విడతలకు బదులు 10 విడతలలో వినియోగం మొదలైన సవరణలు చేశారు. కాని జి.ఓ.నెం. 132 తేది 06-07-2005 పేరా 3(ఏ)లో పేర్కొన్న The Child care leave would be permitted only if the child is dependent on the Government Servant (ప్రభుత్వ ఉద్యోగి పై ఆధారితుడైన పిల్లలు ఉంటే మాత్రమే ఈ చైల్డ్కేర్ లీవ్ వినియోగించుటకు అనుమతి లభిస్తుంది.) అనే షరతును మాత్రం తొలగించలేదు, మార్చలేదు.