నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విజయనగరం జిల్లా శాఖ ఏర్పాటు
నోబుల్ టీచర్స్ అసోసియేషన్
విజయనగరం జిల్లా NTA నూతన కమిటీ ఎన్నిక
విజయనగర జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు మూకల అప్పారావు అధ్యక్షతన ప్రభుత్వ జూనియర్ కళాశాల విజయనగరం లో జరిగింది. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా మిత్తిరెడ్డి చిరంజీవులు నాయుడు ప్రధాన కార్యదర్శిగా బూడి శీతం నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.విజయనగ రం NTA సమావేశంలో ముఖ్య అతిథిగా డా.యం హనుమంత రావు తెలుగు అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వారు హాజరై సంఘం అభివృద్ధికి సూచనలు,సలహాలు ఇచ్చారు రాష్ట్ర సహా అధ్యక్షుడు బి నరేంద్ర, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బి హైమారావు, సూర పాపారావు, యస్ ముకుంద రావు,వి.రాజారావు తదితరులు హాజరయ్యారు.సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సమస్యలు చర్చించారు. జీతాలు 1 తేదీనే చెల్లించాలి, నూతన పి ఆర్ సి కి ముందు 30%ఐ ఆర్ ప్రకటించాలి. జీఓ 117 రద్దు చేయాలి.మునిసిపల్ విలీన జి ఓ 84 రద్దు చేయాలి, అక్రమ బదిలీలు రద్దు చేయాలి, అన్ని రకాల పెండింగ్ బకాయిలు చెల్లించాలి,EHS క్యాష్ లెస్ వైద్యం అన్ని కార్పొరేట్ వైద్యశాలల్లో చేయాలని డిమాండ్ చేశారు..