మల్టీ జోన్ వ్యవస్థ
95% లోకల్ కోటా.. మల్టీజోన్ల వ్యవస్థ
కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ముఖ్యాంశాలు
కేంద్ర హోం శాఖ ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్-2025’ వలన
కొత్తగా జరిగిన మార్పులేమిటంటే..
ఇందులో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు,
మరో 5 శాతాన్ని ఓపెన్ కోటాగా ఉంటుంది.
గతంలో 4 జోన్లు ఉండగా ఇప్పుడు జిల్లాల సంఖ్య పెరగడంతో 6 జోన్లు చేశారు.
వీటిని తిరిగి 2 మల్టీజోన్లుగా విభజించారు.
గతంలో రాష్ట్ర కేడర్ పోస్టులుగా ఉన్న సీటీవో, డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులను మల్టీజోనల్ పోస్టులుగా మార్చారు.
గతంలో సీటీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు రాష్ట్రమంతా ఏ జిల్లాకైనా బదిలీపై వెళ్లేవారు. ఇప్పుడలా కుదరదు.
ఒక మల్టీజోన్ నుంచి ఇంకో మల్టీజోన్‌కి స్పౌస్ గ్రౌండ్స్‌లో బదిలీ కోరుకుంటే సీనియారిటీ కోల్పోతారు.
గతంలో జిల్లా పోస్టులకు స్థానిక, ఓపెన్ కోటా నిష్పత్తి 85:15,
జోనల్ పోస్టులకు 70:30, మల్టీ జోనల్ 60:40గా ఉండేది.
ఇప్పుడు ఆ మూడు రకాల పోస్టులకు లోకల్, ఓపెన్ కోటాను 95:5గా చేశారు.
గతంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ ప్రాంతంలో స్థానికులుగా నిర్ణయించేవారు.
ఇప్పుడు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికే స్థానికులుగా ఉంటారు.
ఉద్యోగుల విభజనకు సంబంధించి ఉద్యోగులకే చాయిస్ ఇస్తా రు. వయసు, సీనియారిటీ, మిగులు సర్వీసు కాలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ ఆర్డర్ జారీ అయినప్పటి నుంచి 27 నెలల్లోగా రాష్ట్రప్రభుత్వం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను నిర్ణయించాలి.
జూనియర్ అసిస్టెంట్ అంతకంటే దిగువ పోస్టులకు జిల్లా యూనిట్‌గా రిక్రూట్‌మెంట్, బదిలీలు జరుగుతాయి.
జూనియర్ అసిస్టెంట్ కంటే పై క్యాడర్ నుంచి ఫస్ట్ లెవల్ గెజిటెడ్ అధికారి వరకు జోన్ యూనిట్‌గా భర్తీ, బదిలీలు ఉంటాయి. ఆపై పోస్టులకు మల్టీజోన్ ప్రాతిపదికన జరుగుతాయి.
సచివాలయం, హెచ్‌వోడీ, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి ఉద్యోగులు లోకల్, జోనల్, మల్టీజోనల్ క్యాడర్లలో డిప్యుటేషన్‌పై వెళ్లి పనిచేయొచ్చు.